రంగారెడ్డి : జిల్లాలోని కీసర మండలం కుందనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కుషాయిగూడ సాయిరాం కాలనీకి చెందిన శివ, సాయికుమార్‌లు ఆదివారం క్రికెట్ ఆడేందుకు మైదానానికి వెళ్లారు. ఆక్కడి నుంచి మధ్యాహ్యం చెరువులో ఈతకు వెళ్లిన యువకులు.. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.