కుటుంబ నియంత్రణ పాటించు_ ప్రగతికి నూతన అధ్యాయాన్ని లిఖించు
నాగర్ కర్నూల్ రూరల్:జులై 11(జనంసాక్షి)
సోమవారము ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా జనాభా దినోత్సవం ర్యాలీని నాగర్ కర్నూల్ డిప్యూటీ(డిఎంహెచ్ఓ)డాక్టర్ వెంకట్ దాస్ ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీని ప్రారంభించారు.వివాహమైన దంపతులు మొదటి మూడు సంవత్సరాలు విధిగా తాత్కాలిక కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించాలని,బిడ్డకు బిడ్డకు మధ్య మూడు సంవత్సరాలు ఎడమ పాటించాలని తెలియజేశారు.ఇప్పుడు ఆధునిక కుటుంబ నియంత్రణ విధానాలు అంతర ఇంజక్షన్,మాలా-N,ఛాయా వంటి నోటి మాత్రలు,కాపర్_టీ,అందుబాటులోకి వచ్చాయని వాటి వల్ల దుష్పర్ దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నారాయణస్వామి,జిల్లా మాస్ మీడియా అధికారి టి నరసింహ,మరియు పర్యవేక్షణ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.