కురుమల జోలికి వస్తే ఊరుకోం! – కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సెవెల్లి సంపత్.
ఒక్క కురుమ ఓటు కూడా నీకు పడదు కొమ్మూరి.
– ఓడిపోతాననే భయం తోనే కురుమలను చులకన.
– కొమ్మూరి తల్లి కూడా కేసీఆర్ పెన్షన్ తోనే బ్రతుకు?
– 22 సంవత్సరాలనుండి తెరాస ని వీడలేదు: సెవెల్లి సంపత్.
– యాభై సంవత్సరాల సీనియర్ పొన్నాలను లెక్క చేయలేదు.
– నాలుగు పార్టీ లు మారిన వాడివి నువ్వు.
జనగామ బ్యూరో (జనంసాక్షి): జిల్లా కేంద్రం లో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్ మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సోషల్ మీడియా లో కురుమ కులస్థుల మనోభావాలు దెబ్బతినేల పోస్ట్ పెట్టడని అన్నారు.
సంవత్సరం క్రితం కురుమ సంఘం లో మాట్లాడిన మాటలను ప్రస్తుతం బిఆర్ యస్ లో ప్రచారం చేసే ఫోటో లు పెట్టి తప్పుచారాన్ని చేయడాన్ని ఖండించారు. తెరాస ద్వారా జడ్పీటీసి, ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీ కి అమ్ముడు పోయావన్నారు. సొంత కన్న తల్లి ని పట్టించుకోక, తల్లి కూడా కెసిఆర్ పెన్షన్ తో బతుకుతున్న పరిస్థితి ఉందన్నారు.22 సంవత్సరాలనుండి బిఆర్ యస్ ని వదలలేదని, మొదట నుండి తెరాస, ఇప్పటికి తెరాస నే అని, యాభై సంవత్సరాల సీనియర్ పొన్నాలను లెక్క చేయలేదని, ఎస్సి బీసి లు కూడా పల్లా కె ఓట్లు వేస్తారని,కాంగ్రెస్ కు ఓట్లు పడవని కుల రాజకీయాలు చేస్తున్నావని, కాంగ్రెస్ సీట్ల విషయం లో గాంధీ భవన్ లో చెప్పులు విసుకున్నారని, జనగామ ప్రజలు పల్లా వెంటే ఉంటూ, కురుమ కులస్థులు ఉంటారని, చెరియల్ ప్రాంతం లో ఎస్సి కులాల జాగలు గుంజుకున్నావన్నారు.అరవై ఏండ్ల కాంగ్రెస్సు పాలనలో తెలంగాణ కి చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమం లో సెవెల్లి మధు సుదన్, తాళ్లపల్లి సురేష్, మోటె ఐలయ్య, ఆలేటి రాజు, స్వరూప, కన్నరపు ఉపేందర్, ప్రదీప్ లు పాల్గొన్నారు.