కులవృత్తులను ప్రోత్సహించింది కెసిఆర్ మాత్రమే
ఎవరికి ఏం చేయాలన్న ప్రణాళికతో ఖర్చు
అభివృద్ది పార్టీనే ఆదరించండి: చందూలాల్
ములుగు,అక్టోబర్29(జనంసాక్షి): కుల వృత్తుల ప్రోత్సాహానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని,అందుకు తగ్గట్లుగా అధిక నిధులను కేటాయిస్తున్నామని మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.15,000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింతగా నిధులను అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతామని కూడా ప్రకటించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రోత్సహించిందన్నారు. స్వచ్ఛందంగా, ప్రేమతో ప్రజలు మద్దతు
పలుకుతన్నారని, ఎక్కడికి వెళ్లినా ఆత్మీయంగా పలకరిస్తున్నారని మంత్రి తెలిపారు. పనిచేసే పార్టీలకు, నాయకులకు మద్దతు తెలుపుతున్నారన్నారు. స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వంద శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా, 75 శాతం సబ్సిడీతో వాహనాలు అందజేత, చేపల విక్రయానికి నూతనంగా మార్కెట్ల నిర్మాణం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ భావితరాల భవిష్యత్, ప్రస్తుత తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే దేశ ప్రజలకు చెయ్యిచ్చింది. ఏదో చేస్తుందన్న ఆశతో బీజేపీకి ఓటేస్తే ఆ పార్టీ ప్రజల చెవిలో పూలు పెట్టింది. అసలు ఈ రెండు పార్టీలతో దేశానికి ఒరిగిందేమిటి? అని మంత్రి ప్రశ్నించారు. పేదలు తల ఎత్తుకొని బతికేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయా పథకాలు ప్రవేశపెట్టి, వాటిని విజయవంతంగా అమలు పరిచామని, మరోసారి అధికారం ఇస్తే ప్లలెలను మరింత ప్రగతిపథంలోకి తీసుకొస్తామని చందూలాల్ ప్రజలను కోరారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన చందూలాల్ బృందానికి ఆయా గ్రామాల పోలిమేరల్లోనే పార్టీ శ్రేణులు, మహిళలు మంగళహారతులు, బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఆయా వర్గాల వారి కోసం సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం నంబర్‌వన్ స్థానంలో నిలిపి ఆయా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపినట్లు చందూలాల్ తెలిపారు. ప్లలెల్లోని అధిక శాతం ఉన్న రైతుల సౌలభ్యం కోసం భూమి శిస్తులు రద్దు చేశారన్నారు. యాభై ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేత కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే చెల్లిందన్నారు. సాగుకు నిరంతర త్రీఫేజ్ సరఫరాతో పాటు, గ్రావిూణ ప్రాంతాల్లో గృహ వినియోగానికి కూడా కోతల్లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళకు అందించే అతి తక్కువగా ఉన్న ఫెన్షన్లను పెంచనున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో సన్నబియ్యంతో భోజనం, పంట రుణ మాఫీ, ఎకరానికి రెండు పంటల పెట్టుబడి కోసం రైతు బంధు కింద రూ.10వేలు, రైతు బీమా కింద మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా, ఆడ పిల్ల పెళ్లి ఖర్చులకు కల్యాణలక్ష్మి కింది రూ.1లక్ష నూట పదహారు నగదువంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మరోసారి అధికారంలోకి తీసుకొస్తే ఈ పథకాలు కొనసాగుతాయన్నారు.