కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి:పౌర హక్కుల దినోత్సవంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి
జనం సాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 30:
కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మండలంలోని ఇందుర్తి గ్రామంలో సర్పంచ్ అందే స్వరూప అధ్యక్షత ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో మంగళవారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యి మాట్లాడాతూ కులవివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ జీవించాలని నేటి సమాజంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుర్తి అతిపెద్ద చైతన్యవంతమైన గ్రామంలో నేటి సమావేశానికి అత్యధిక మంది హాజరు అయ్యారు. తహశీల్దార్ సయ్యద్ ముభిన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతినెల 30 తారీకు మండలంలో ఏదో ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని గ్రామాల్లో కుల వివక్ష పాటించకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించాలని అన్నారు.సమాజంలో మానవత్వమే కులమని అన్నారు. ఎవరైనా గ్రామాల్లో కుల వివక్షకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై దాస సుధాకర్ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టి, బిసి అన్ని కులాల యువత రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేయాలన్నారు. విద్య ద్వారానే కులహిత సమాజాన్ని స్థాపించగలమని అన్నారు. విద్య ద్వారా ఉద్యోగం వస్తేనే సమాజంలో గుర్తింపు ఉంటుంది మద్యపానం గంజాయి పేకాట వంటి జోలికి ఎవరు వెళ్లకూడదున్నారు. గ్రామ సర్పంచ్ అందే స్వరూప స్వామి మాట్లాడుతూ గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి కానీ కుల వివక్ష లేదన్నారు. అందరం కలిసి మెలిసి ఉంటామన్నారు.మాజీ జెడ్పీటీసీ అందే స్వామి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే దళితులకు న్యాయం జరిగిందని తన పదవికి కారణం రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే అని గుర్తు చేశారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో స్థలం కేటాయించాలని తాసిల్దార్ ముబీన్ అహ్మద్ ను నాయకులు కోరారు. ఈకార్యక్రమంలో ఏఓ రంజిత్ రెడ్డి, ఎంపీడీవో నరసయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అందే బాబు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, ఉపసర్పంచ్ తోట సతీష్,సెక్రెటరీ వెంకట రమణ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ నాగ శేఖర్, ఆర్ఐ శై, ఏఈఓ సతీష్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డ్ సభ్యులు, అందే అన్నపూర్ణ, పుల్లయ్య, చిలుపూరి విష్ణుమాచారి, వివిధ శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘం నాయకులు, పర్శరాములు, అందే చిన్న స్వామి, పోశయ్య, తిరుపతి, సాగర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.