కూతుర్ని కడతేర్చిన కన్న తండ్రి

z3equhu5

 

రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కాలమయుడై ముక్కుపచ్చలారని కూతుర్ని చంపేశాడు. పరిగి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జాఫర్‌పల్లి గ్రామానికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిలో 7నెలల వయసున్న చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా తండ్రి వెంకటయ్య బయటకు తీసుకెళ్లి చిన్నారిని గొంతునులిపి చంపేశాడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని ఓ నీటి గుంతలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగొచ్చాడు. అయితే చిన్నారి కనిపించకపోవడంతో..అనుమానం వచ్చిన భార్య..వెంకటయ్యను నిలదీయగా…జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన కుటుంబసభ్యులు..నీటిగుంతలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అనంతరం చిన్నారిని చంపిన వెంకటయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.