కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

జులై 15 జనం సాక్షి

ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించారు. అంకని మల్లవ్వ 3200/- రూపాయలు, జల్ల దుర్గయ్య లకు రూపాయలు 3200/- ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు, జడ్పిటిసి గుండం నర్సయ్య , రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల  గోపాల్ రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మండల తహసీల్దార్ మునీందర్, తెరాస మండల అధ్యక్షులు సురేందర్ రావు,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శీలం జానాభాయ్, తుర్కపల్లి సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దేవదాస్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సాయిప్రసాద్, వీఆర్వో రామచంద్రం ,రవి , కార్యదర్శి శ్రీనివాస్ , టిఆర్ఎస్ సోషల్ మీడియా విశ్వనాథ్, తెరాస నాయకులు రంజిత్, రాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.