కృష్ణజింకల కేసులో తుదితీర్పు నేడే

2

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి):  కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడనుందా లేదా అనేది ఇవాళ తేలనుంది. 1998లో హమ్‌సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ సందర్భంగా రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో కృష్ణ జింఖలను వేటాడినట్లు కేసు నమోదైంది. షూటింగ్‌ సందర్భంగా సైఫ్‌ అలీఖాన్‌, టబూ, నీలం, సోనాలి బింద్రెతో కలిసి వేటకు వెళ్లినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ట్రయల్‌ కోర్టు సల్మాన్‌కు 5ఏళ్ల జైలు శిక్ష విధించింది. అడవి జంతువుల సంరక్షణ చట్టం కింద సల్మాన్‌ దోషిగా తేలాడు. అయితే ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సల్మాన్‌ ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాడు. కిందికోర్టుడ విధించిన శిక్షపై రాజస్తాన్‌ హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాజస్థాన్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ పూర్తి చేసిన జస్టిస్‌ ముఖోపాధ్యాయ, గోయల్‌ల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. నేడు కృష్ణజింకల కేసులో తుది తీర్పు వెలువడనుంది.