కృష్ణానది తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ సీతయ్య.

మక్తల్ జూలై 26 (జనంసాక్షి) నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ నది తీరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సీతయ్య అన్నారు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు మక్తల్ సిఐ సీతయ్య, కృష్ణ ఎస్సై విజయభాస్కర్ లు కృష్ణ, బీమా నదుల సంగమం తంగేడు ప్రాంతాన్ని సందర్శించి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు భాగంగా ప్రజలు, రైతులు, పశువుల కాపరులు నది పరివాహక ప్రాంతానికి చేపల వేటకు వెళ్లకుండా గ్రామ పెద్దలకు అవగాహన కల్పించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, గ్రామాలలో ఉన్న ప్రజలు మట్టినిద్దెలు, పురాతన ఇళ్లల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నదిలోకి పుట్టిలలో ఎవరు వెళ్లరాదని అన్నారు. భారీగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పై నుండి వరద నీరు ఎప్పుడైనా రావచ్చు అని ఇరిగేషన్ అధికారులతో సమన్వయం కలిగి ఉండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఎస్సై విజయభాస్కర్ తో పాటు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.