కృష్ణా పోర్టును కట్టడి చేయండి
– దత్తాత్రేయకు హరీశ్ ఫిర్యాదు
హైదరాబాద్,జూన్ 4(జనంసాక్షి): కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తాత్రేయ ఇంటికి వచ్చిన హరీశ్‌రావు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ కృష్ణా నది నీటివాటాలో భాగంగానే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం అసత్య వాదనలు చేస్తూ కేంద్రానికి లేఖలు రాస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా బోర్డు వైఖరిని నిరసిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి దిల్లీ వెళ్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. బోర్డు తన పరిధిని దాటి నీటివాటాలపైపెత్తనం చేస్తోందని అన్నారు. దాని పరిధి కేవలం అమలుచేసే బాధ్యత మాత్రమేనని అన్నారు. ఢి ల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలిసి దీన్ని విన్నవిస్తామని తెలిపారు. ఇదే విషయాన్‌ఇన దత్తాత్రేయకు వివరించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంపై ఉమాభారతితో ఫోన్లో మాట్లాడతానని దత్తాత్రేయ చెప్పారు. తెలంగాణకు న్యాయం జరిగే విధంగా.. తమ హక్కులు కాపాడే విధంగా కేంద్రం సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. కృష్ణా బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇవాళ కేంద్ర మంత్రి ఉమా భారతితో మాట్లాడుతానని తెలిపారు. నీటి పంపకాలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆమెను కోరుతానని పేర్కొన్నారు. కాగా, కృష్ణా బోర్డు నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఇవాళ దత్తాత్రేయను కలిశారు. ఇకపోతే రాస్టంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు కేంద్రం సాయం అందించేలా చూస్తామని అన్నారు.