కెఎల్‌ రావు సూచనలతో నదుల అనుసంధానం

నీటి సమస్యలకు ఇదే పరిస్కారం అంటున్న నిపుణులు

అమరావతి,జూన్‌28(జ‌నం సాక్షి): ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న నదుల అనుసంధానం అమలు చేయడమే భవిష్యత్‌ సంక్షోభానికి మార్గమని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానానికి కేంద్రం నడుం బిగించాలని కోరారు. ఇందుకు కెఎల్‌ రావు అనుసరించిన, ప్రతిపాదించిన సూచనలతో సాగాలన్నారు. ప్రస్తుత జల సంక్షోభానికి, దేశంలోని రైతులను, వ్యవసాయాన్ని కాపాడటానికి నదుల అనుసంధానం మాత్రమే పరిష్కారం చూపగలదని, దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. 1972లో కేంద్ర జలవనరులశాఖ మంత్రిగా ఉన్న కె.ఎల్‌.రావు దార్శనికతో ప్రతిపాదించిన నదుల అనుసంధాన పథకం సమగ్ర నివేదికను ప్రస్తుతం అమలు చేయడమే సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ నివేదికపై క్రియాశీలక చర్యలు చేపట్టక పోవడంతో నదుల అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కమిటీ రద్దయిందని, ఎట్టకేలకు అది కేంద్ర జలవనరులశాఖలో ఓ విభాగం కిందఉందన్నారు. రాష్ట్రంలో ప్రవహించే నదుల అనుసంధాన పథకాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిన నేపథ్యంలో దానిని వెంటనే అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే అంతర్రాష్ట నదుల అనుసంధాన విషయంలోనూ ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఇటీవల తమిళనాడులో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కావేరీ వివాదం తలెత్తింది. నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రిని కోరారు. రాష్టాల్ర మధ్య నదీజలాల అనుసంధాన వివాదంతో తమిళనాడు నేడు దుర్భర పరిస్థితులు అనుభవిస్తోందని, పంటలు పండక వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్టాన్రికి రావాల్సిన జలాధారాలను అడ్డుకోవడం, అంతర్‌ రాష్టాల్ర నదీ జలాల ఒప్పందం అతిక్రమించి చెక్‌ డ్యామ్‌లు నిర్మించడం పొరుగు రాష్టాల్రకు నిత్యకృత్యంగా మారిందని పేర్కొన్నారు. దీనికి నదుల అనుసంధానం చేస్తూ జాతీయ జలవిధానాం తీసుకుని రావాలన్నారు.