*కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

మంత్రి ఐకె రెడ్డి,జడ్పీటీసీ అనిల్ జాదవ్.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరి బాయి భర్త రాజు ఇటీవల హృద్రోగంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు నేరడిగొండ మండల జడ్పిటిసి అనిల్ జాదవ్ లు శనివారం రోజున ఇంద్రవెళ్లిలోని వారి స్వగృహానికి వెళ్లి ఈశ్వరి బాయిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఇట్టి కార్యక్రమంలో మంత్రి ఐకె రెడ్డి, జడ్పీటీసీ అనిల్ జాధవ్ తోపాటు ఇంద్రవెల్లి మండల మార్కెట్ చైర్మన్ శ్రీరామ్ నాయాక్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
 
Attachments area