కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌

ప్రచారంలో పొన్నాల విమర్శలు

జనగామ,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్‌.. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు, జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మాయమాటలతో కేసీఆర్‌ ఓట్లు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంగళవారం ఆయన చేర్యాల, కడవేర్గు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ ఓడిపోతే ఫాంహౌజ్‌లో పడుకుంటా అంటున్నారు..కేటీఆర్‌ అమెరికా పారిపోతా అంటున్నారు..అధికారంలో లేకపోతే ప్రజలకు సేవ చేయరా అని ప్రశ్నించారు. ప్రజలకు సేవచేయని నాయకులను దూరం పెట్టాలన్నారు. కుటుంబ పాలనతో ప్రజలను ఇక్కట్లకు గురిచే/-తున్న వారిని ఓడించాలన్నారు. రీ డిజైన్‌ పేరుతో కోట్లు దోచుకున్న వారిని అధికారంలోకి రాగానే డబ్బు కక్కిస్తామన్నారు.తెలంగాణ టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రమణ, కోదండరామ్‌, చాడ వెంకట్‌ రెడ్డిలు పక్కా తెలంగాణ బిడ్డలేనన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి

కవిూషన్లు తీసుకున్నప్పుడు ఆంధ్రోళ్లు అని గుర్తురాని కేసీఆర్‌కు.. ఎన్నికలు అనగానే ఆంధ్రోళ్లు అని గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు . కెసిఆర్‌ వాటం తీరు మాట్లాడుతారని అన్నారు. ప్రగతిభవన్‌ వీడి ఉరాకుండా, సచివాలయం నుంచి కాకుండా ఇంటినుంచి పాలన చేస్తానని అనడం ఎంతవరకు సబబని అన్నారు. ప్రాజెక్టులను కట్టడం చేతకాక చంద్రబాబును బూచిగా చూపుతున్నారని ఆరోపించారు.

సోనియా టూర్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌ భయపడుతున్నారని పొన్నాల అన్నారు. మేడ్చల్‌ సభకు భారీగా తరలివచ్చిన జనంతో టిఆర్‌ఎస్‌ బెంబేలెత్తిపోతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ ముసుగులో అక్రమాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. జనగామ జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవ్వలేదు.. ఇక్కడి ప్రజలంతా కోట్లాడి సాధించుకున్నారన్నారు. మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెబుతున్న మంత్రి.. నేటికి జిల్లాలో ఎగువమానేరుకు నీళ్లురాలేదు.. ఒక్క ఎకరం సాగులోకి వచ్చిందిలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది అశువులుబాసిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారి త్యాగాల పునాదులపై తన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తును నిర్మించారని తెలిపారు. డిసెంబరు 11న అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని జోస్యం చెప్పారు. అప్పుడు అమరవీరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో యువత, విద్యార్థులపై దాడులు చేయించిన వారిని తెరాస అధికారంలోకి రాగానే వారిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.