కెసిఆర్‌పై కాంగ్రెస్ అవినీతి అస్త్రం
తెలంగాణలో నిజానికి ఇంకా వేడి మొదలు కాలేదు. మహాకూటమి టిక్కటెల్ వ్యవహారం కొలిక్కి రాలేదు. అయినా ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. అధికార టిఆర్‌ఎస్‌ను ఢీ కొనేందుకు ప్రజాకూటమి, బిజెపిలు ఎదురుదాడి మొదలు పెట్టాయి. ప్రచారంలో ఇంకా దూకకముందే విమర్శలతో ఎదుటి పక్షం ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా దూకుడు పెంచారు. అధికార టిఆర్‌ఎస్ లక్ష్యంగానే కాంగ్రెస్, బిజెపిలు విమర్శలకు పదను పెట్టాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. బహుశా వీటన్నంటికి కెసిఆర్ కూడా ఎదురుదాడి వ్యూహాలు రచిస్తూ ఉంటారు. అసలుసిసలు ప్రచారంలో కెసిఆర్ మరింత వాడిగా తన భాషకు పదను పెట్టగలరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా గుత్తేదార్లకు కట్టు బానిస అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు కొతతవేవిూ కాదు. గతకొంతకాలంగా కాంగ్రెస్ ఇవే విమర్శలను చేస్తోంది. కేసీఆర్ లంచగొండితనం, అవినీతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తెరాస ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. తెరాస పాలనలో పట్టపగలే రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతోందని, ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆక్షేపించారు. తెలంగాణలో గుత్తేదారులు లేనట్లు..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు సంబంధించి ఏకంగా రూ.77 వేల కోట్ల పనులను ఆ కంపెనీలకే అప్పగించా రని, ఉద్దేశ పూర్వకంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచారని విమర్శించారు. ఈ తరహాలో పనులను అప్పగించడం దేశంలో ఎక్కడా చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని వ్యాఖ్యా నించారు. గతకొంతకాలంగా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై విమర్శలు చెలరేగుతూనే ఉన్‌ఆనయి. తాజాగా వీటిపైనే మళ్లీ జైపాల్ రెడ్డి విమర్వలు చేశారు. ఇదంతా అవినీతి అస్త్రంతో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కో వాలన్న వ్యూహంలో భాగంగా చూడాలి. ప్రాజెక్టుల వాస్తవ వ్యయం కంటే దాదాపు 30 శాతం అంచనాలు పెంచి ఖర్చు చేశారు. అందులో కేసీఆర్ 6 శాతం కవిూషన్ తీసుకోవడంతో పాటు,మంత్రులకు, తన కుటుంబ సభ్యులకు, భజనపరులకు ఎంత శాతం కవిూషన్ ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయించారని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చయినా గ్రామాలకు గొట్టాలు వచ్చాయి తప్ప నీళ్లు రాలేదని, ఎకరా భూమికి సాగునీరు పారలేదన్నారు. నాలుగేళ్లలో తెలంగాణను నిండా ముంచిన చరిత్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాగానే నాలుగేళ్ల తెరాస పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపిస్తా మని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పనుల్లో తేడా జరిగినట్లు తేలిన పక్షంలో సదరు కంపెనీల అర్హత రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేనా అంటే అవినీతి ఆరోపణలు తప్పని రుజువు చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల ఘట్టంలో ఇలాంటి సవాళ్లు ఇంకా వేల్లో ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ప్రచారంలో ఎదుటివారిని దెబ్తీసే క్రమంలో ఇలాంటి ఆరోపణలు కూడా సహజమే. అయితే ఆధారాలు చూపే వాటిని మాత్రమే ప్రజలు సిరియస్‌గా పరిగణిస్తారు. అంతేనా అంటే..మహా కూటమితో కేసీఆర్, కేటీఆర్‌లకు భయం పట్టుకుందని జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు అమ్ముడు పోయారంటూ ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. విమానాల్లో ప్రచారానికి కేసీఆర్ చేసిన ఖర్చులో కాంగ్రెస్ చేస్తున్నది గోరంత మాత్రమేనన్నారు. ఇకపోతే పిసిస చీఫ్ కూడా ఇదే తరహాలు విమర్శలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ కుటుంబం తప్ప తెరాస ముఖ్యనేతలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా
ఉన్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, మోసపూరిత హవిూలతో అధికారంలోకి వచ్చిన తెరాస నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హావిూనీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. దీంతో తెరాసలోని పెద్ద నాయకులతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యనేతలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి, ఇళ్లు లేనివారికి రెండు పడకగదుల ఇళ్లు వంటి హావిూలేవీ నెరవేరలేదు. అనవసర ఆర్భాటాలతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఏ ఆకాంక్షతో రాష్ట్రం సాధించుకున్నామో అందుకు విరుద్ధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. కేసీఆర్ భాజపాతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చు కున్నారని ముందు నుంచి అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీచేస్తారని కూడా అన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు ఓటు వేసినట్లే. హావిూలు నెరవేర్చలేక, పరిపాలన చేతగాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు లేదంటూ ప్రచారం చేపట్టారు.ఇక ఆరోపణలు చేఇ ఊరుకుంటే ప్రజలు ఆదరించరు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను కూడా చెబుతున్నారు. అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు రేషన్ సరకులు ఉచితంగా ఇస్తామని, చౌక దుకాణాల్లో బియ్యంతో పాటు 9రకాల సరకులను పంపిణీ చేస్తాం అని ప్రకటించారు. సోనియా రాష్ట్రమిచ్చినా తెరాస బంగారు తెలంగాణ చేయలేకపోయిందంటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు మొదట మద్దతు తెలిపిన కేసీఆర్ మోదీ భయంతోనే వెనక్కి తగ్గి మధ్యంతర ఎన్నికలకు తెరతీశారని బిజెపి ఆరోపిస్తోంది. ముందస్తు కు కారణాలు చెప్పాలని నిలదీస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో మోదీ గాలి వీస్తుందని, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోవడం ఖాయమనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నా రని వ్యాఖ్యానిస్తోంది. ప్రతిపక్షాలు న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నాయనే ముందస్తుకు వెళ్లామని కేసీఆర్ అంటున్నారు. రజాకార్ల రూపంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఎంఐఎంతో తెరాస పొత్తు పెట్టుకోవడం అనైతికం అంటూ ఎదురుదాడి చే/-తోంది.నాలుగేళ్లుగా సచివాలయానికే వెళ్లని ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్నది వారి ప్రధాన ఆరోపణగా ఉంది. మొత్తంగా ఎన్నికల్లో ప్రచారం ఊపందుకునే లోగా ఆరోపణలు వేడెక్కాయి.