కెసిఆర్‌ ప్రకటనలో ఆశ్చర్యమేవిూ లేదు

ఎన్నికల తరవాత జరగబోయేది అదే: పొన్నాల

జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు ఉందే ఓటమిని అంగీకరించిందని జనగమా కాంగ్రెస్‌ అబ్యర్థి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలకు అప్పుడే భయం పట్టుకుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ముందే పసిగట్టి అందుఉ తగ్గట్లుగా ప్రకటనలు చేస్తున్నారని శుక్రవారం నాడిక్కడ అన్నారు. తనకు ఎన్నికల్లో ఓట్లేస్తే అధికారంలో ఉంటా.. ఓడిపోతే ఫాంహౌజుకే పరిమితమవుతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొనడంలో పెదద్గా ఆశ్చర్యం లేదన్నారు. ఎలాగూ ఆయన అక్కడికే వెళ్లడం ఖాయమన్నారు. కెటిఆర్‌, కెసిఆర్‌ వ్యాఖ్యలు వారిలో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేవేనని అన్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి వారు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తన సొంత ఆస్తిలా కేసీఆర్‌ భావిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష ¬దాలో కొనసాగే మనోధైర్యం లేకే వైదొలగాలని చూస్తున్నారన్నారు. కొడుకు కేటీఆర్‌ సన్యాసం చేస్తామనడం.. తండ్రి కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు పరిమితమవుతానని చెప్పడం బట్టి చూస్తుంటే.. ఓటమి భయంతోనే వారు అలా మాట్లాడుతున్నారని అర్థమవుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని అవమాన పరచి, తెలంగాణ యువతను వంచించి మోసం చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూ నెరవేర్చక, ఇంతకాలం అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక పాలనపై కూటమి ఆధ్వర్యంలో ప్రజలు తిరగబడుతున్నారని, వారి ఆగ్రహ సునావిూలో తెరాస నాయకులు కొట్టుకుపోతారన్నారు.ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే సమయం ఆసన్నమైందన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి మంచి నేతలు అక్కడ ఉండలేక సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని చెప్పారు. జనగామను అన్ని విధాలా తీర్చిదిద్దుతానని, గతంలో జరిగిన అభివృద్ధే తప్ప, కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందేవిూ లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే తనకు అండగా నిలవాలని కోరారు.