కెసిఆర్‌ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి: చారి


ఆదిలాబాద్‌ ,జ‌నం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, దేశానికే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాష్ట్ర అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలిచాయని న్యూఢిల్లీలో అధికార ప్రతినిది డాక్టర్‌ వేణుగోపాలచారి అన్నారు. కెసిఆర్‌ ఫ్రంట్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని, దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులే ఇందుకు దోహదపడుతున్నాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ అధినేత,
ఉద్యమనేత అయిన కేసీఆర్‌ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఒకతాటిపైకి తీసుకవచ్చి తెలంగాణ ఉద్యమాన్ని కనీవినీ ఎరగని రీతిలో నడిపించారన్నారు. ఉద్యమానికి వెరసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ప్రత్యేక తెలంగాణను, రాష్టాన్న్రి ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేత కేసీఆర్‌ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతో నెరవేర్చారన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఇప్పుడు అదేరీతిలో ఫ్రంట్‌ కూడా ముందుకు సాగగలదని అన్నారు. ఇకపోతే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు నాలుగువేల ఆర్థిక సాయం అందించడం ఆషామాషీ కాదన్నారు. ప్రభుత్వం పీఏసీఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు తేమ లేకుండా, ఆరబోసిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి త్వరగా కొనుగోళ్లు జరిపేందుకు సహకరించాలని అన్నారు. ప్రభుత్వం ఏగ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు 1590, సీగ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు 1550 రూపాయలను అందిస్తుందని తెలిపారు.