కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రాష్ట్రానికి శ్రీరామరక్ష
తుంగతుర్తి/ మోత్కూరు నవంబర్ 14 (జనం సాక్షి)
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సతీమణి గాదరి కమల అన్నారు .
మంగళవారం మోత్కూరులో బారాస మహిళా నాయకురాండ్ర తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిలా ఉన్నాయని ప్రతి ఇంటింటికి కెసిఆర్ సంక్షేమ పథకాలు చేరాయని అన్నారు. గత 60 ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న డాక్టర్ గాదరి కిషోర్ ను మూడోసారి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూత అందించాలని అన్నారు. రెండుసార్లు ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా ఆదరించారని ఈసారి కూడా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు .కళ్యాణ లక్ష్మి. కెసిఆర్ కిట్టు. గృహలక్ష్మి. పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ మేనమామ అయ్యాడని అన్నారు. కాలేశ్వరం జలాల ద్వారా ఎస్సార్ ఎస్పి కాలువల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి రెండు పంటల కి సరిపడా నీళ్లు ఇవ్వడంతో పాటు రైతుబంధు. రైతు బీమా తదితర పథకాలు ఇచ్చి రైతు బాంధవుడు అయ్యాడని అన్నారు. పండించిన పంటను ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఆసరా పెన్షన్ 5000. దివ్యాంగులకు 6000. రూపాయలు చొప్పున పెంచనున్నట్లు తెలిపారు. అలాగే రైతుబంధు ఎకరానికి దశలవారీగా 16 వేల రూపాయలు పెంచనున్నట్లు తెలిపార. కరువు కాటకాలతో, కక్షలు కార్పన్యాలతో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిషోర్ కుమార్ దేనని ఆమె తెలిపారు. . నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు. మురికి కాలువలు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు .నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే ఈ నియోజకవర్గంలోని అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి కావాలంటే గాదరి కిషోర్ కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించి, హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు, ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ తీపి రెడ్డి సావిత్రి, పుర ఉపాధ్యక్షుడు బి వెంకటయ్య, ఎంపీపీ రచ్చ కల్పన, జెడ్పిటిసి సభ్యురాలు గోరుపల్లి శారద, కౌన్సిలర్లు గుర్రం కవిత, లేంకల సుజాత,పురుగుల వెంకన్న,దెబ్బెట్టి విజయ, భారాసా మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత , రైబాస జిల్లా సభ్యులు దబ్బేటి శైలజ, జంగా శ్రీనివాస్, కట్ట ఇందిరా జ్యోతి, కమల, పుర కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ నబీ, గనగాని నరసింహ, షాహినాబ్ సుల్తానా, బారాస మండల అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్,పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ చక్రవర్తి, బారాస నాయకులు మర్రి అనిల్, బయ్యని పిచ్చయ్య,నల్ల ప్రభాకర్, బోడ శ్రీను, బొల్లెపల్లి శ్రవణ్, మంచ గోవర్ధన్, కొక్కుల సత్యనారాయణ, బయ్యని రాజు, మామిడాల యాకేష్, మునీరుద్దీన్, జవ్వాజి అనిత, అరుణ, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, చేతరాశి వెంకన్న, లెంకల వేణు, డబ్బేటి రమేష్, గ్రంథాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోమటి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు
హోటల్లో పూరీలు వేస్తూ………. వినూత్న ప్రచారం…….
ఎమ్మెల్యే సతీమణి గాదరి కమల టిఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి మెయిన్ రోడ్ పైల ఓటర్లకు సాంప్రదాయబద్ధంగా కుంకుమ. బొట్టు పెట్టి తన భర్త గాదరి కిషోర్ కుమార్ ను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్డుపై ఉన్న హోటల్కు చేరుకొని అక్కడ మహిళా నాయకురాలతో కలిసి పూరీలు వేస్తూ తన భర్త కిషోర్ కుమారును గెలిపించాలని వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. తో దీంతో ఆమె చేస్తున్న ప్రచారాన్ని సైతం అక్కడ ఉన్న మహిళలు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ గాదరి కిషోర్ కుమార్ గెలవడం ఖాయమని అంటున్నారు.