కేంద్రంపై బాబు న్యాయ పోరాటం కలసివచ్చేనా?

జగన్‌, జనసేనల విమర్శలకు బదులు చెప్పని వైనం

బాబు లక్ష్యంగా బిజెపి ఎక్కుపెడుతున్న బాణాలు

ఎపిలో రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు

అమరావతి,జూలై9(జ‌నం సాక్షి): విభజన హావిూల అమలు విషయమై కేంద్రంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ప్రారంభమైన రాజకీయ పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. కేబినేటల్‌ఓ చర్చింన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ ఇక న్యాయపోరాటం ద్వారా దేశరాజధాని వేదికగా టిడిపి పోరు ఉధృతం చేయబోతున్నది. ఎన్‌డీఏ నుంచి విడిపోయిన నాటి నుంచి బీజేపీపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందివచ్చిన ప్రతి అంశాన్నీ రాజకీయంగా అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కడప ఉక్కు కోసం ఉద్యమించడం, రైల్వేజోన్‌ కోసం పోరాటం చేయడంతో పాటు అవకాశం ఉన్న అన్ని అంశాలపై పోరాడుతున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశ వేదికపైనా పోరాటం చేశారు. ప్రత్యేక ¬దా ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్‌ను అనుకూల అంశంగా చంద్రబాబు మలచుకున్నారు. ఈ అఫిడవిట్‌ ద్వారా కేంద్రం వైఖరి స్పష్టం కావడంతో దీని ఆధారంగా అటు బిజెపిని ఇటు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు లక్ష్యంగా చంద్రబాబు విమర్శలకు పదను పెట్టారు. బాటు టార్గెట్‌ కూడా ఇదే.బిజెపి, వైకాపా, పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వం ఒక్కటే అన్న ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నారు. వారికి బీజేపీతో లోపాయికారి అవగాహన ఉదదన్న అనుమానం సామాన్య ప్రజలలో కలిగేలా ముందుకు సాగుతున్నారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించడం ద్వారా బీజేపీతో పోరాడుతున్నది టిడిపి ఒక్కటేనని, ప్రత్యేక¬దాపై తమకు మాత్రమేఉ చిత్తశుద్ది ఉందని ప్రజలకు బలంగా చెప్పుకొనేలా ప్రచారం చేస్తోంది. అయితే రాషట్‌రానికి ఇచ్చిన సాయాన్ని దుర్విఇయోగం చేశారని, నిధులు దారిమళ్లాయని, తెలుగుదేశం పార్టీ తమను మోసం చేసిందని భారతీయ జనతాపార్టీ నాయకులు ఎదురుదాడికి దుగుతున్నారు. ఇదే సందర్భంలో వైకాపా, జనసేన కూడా గత నాలుగేళ్లుగా బాబు నిద్రపోయిన వైనాన్ని ఎండగడుతున్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుని పోయిందని పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలలో ఇదేవిూ అసాధారణ పరిణామం కాదు. ప్రజల మనోభావాలను గమనించిన నేతలు సమయానుకూలంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంపై పోరాటం చేయడం ద్వారా మరోమారు అధికారాన్ని నిలుపుకునే యత్నం మినహా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ప్రత్యామ్నాయం లేదు. అధికారంలో ఉన్న పార్టీపై ఎల్లెడలా వ్యతిరేకత ఉంటుంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు బాబు ఇప్పుడు కేంద్రంపై దాడి చేయడాన్ని అవకాశంగా తీసుకున్నారు.అందుకే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రచార ప్రయత్నం మొదలుపెట్టారు. రాష్టాన్రికి అన్యాయం చేసిన ప్రధాని మోదీతో పోరాటం చేయడమే లక్ష్యంగా ప్రజలను సన్నద్దం చేస్తున్నారు. ప్రత్యేక ¬దా విషయమై ప్రజలలో భావోద్వేగాలు పతాకస్థాయిలో ఉన్నందున దానిని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కారణంగానే జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మలని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రజలలో తిరుగుతున్న జగన్‌, పవన్‌ కూడా ఇదే విధంగా టిడిపి నాలుగేళ్ల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇకపోతే చంద్రబాబును ముఖ్యమంత్రిని కానివ్వకూడదన్నదే తమ లక్ష్యమని బీజేపీ నేతలు ప్రకటించారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికి చంద్రబాబు మరింత ముమ్మరంగా పోరాటం చేయవచ్చు. రాజకయీంగా పరస్పరం బురదజల్లుకునే యత్నాల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఎన్నికల

ఫలితాలు తేల్చనున్నాయి.