కేంద్రం దిష్టి బొమ్మ దహనం – పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నా రాస్తారోకో
నర్సింహులపేట : మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రెటోల్ ధరలను పెంచడాని నిరసిస్తూ టీిఆర్‌ఎస్, సీపీిఎం,సీపీిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెరాస మండలాధ్యక్షులు ఎండీ ఖాజమీయ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యూడికి అందుబాటులోని విధంగా నిత్యవసర ధరలతో పాటు పెట్రోల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే పెట్రోల్ ధరను రూ.7.50 పెంచి మూలిగె నక్కపై తాట్టి పండు పడ్డ చందంగా వ్యవహరిస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇప్పట్టికెే 17 సార్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజల పై పెనుభారం మొపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పట్టికైన పెంచిన పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించకుంటే పెద్ద ఎత్తున్న ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా, రాస్తారోకోలో తెరాస నాయకులు మల్లయ్య, స్టాలిన్, శ్రీపాల్, జెమిని, సీపీఐ రైతు సంఘం మండలాధ్యక్షులు ఎనగందుల సోమిరెడ్డి, మోహన్, బిక్షపతి, వెంకన్న, తదితర నాయకులు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.