కేంద్రం సొమ్ముతో టిఆర్ఎస్ సోకులు

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి వైపే ప్రజలు

* కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లండి

* ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

* బిజెపి శ్రేణులతో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వ పథకాలు , మోడీ ప్రభుత్వం తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయిదిలీప్ కుమార్ సూచించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి అధ్యక్షతన మంగళవారం కరీంనగర్ లోని శుభ మంగళ ఫంక్షన్ హాల్ లో జిల్లా, మండల పదాధికారుల సమావేశం జరిగింది . ఇట్టి సమావేశానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడంతో, ప్రజలందరూ బిజెపి పాలన వైపు చూడడంతోనే 18రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిపారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో అధిక శాతం ప్రజలు వైపు మొగ్గు చూపడంలో అక్కడి స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం , ప్రజా సమస్యల పైన ఉద్యమించడం లాంటి అనేక కారణాలతో విజయం సాధించారని , అందుకే ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావడానికి శ్రేణులు అందరూ తగిన కార్యాచరణలతో ముందు కొనసాగాలని పిలుపునిచ్చారు .ప్రజా వ్యతిరేకిగా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి బిజెపి శ్రేణులు నిరంతరం పోరాటం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మారిన బిజెపి వైపు ప్రజలు చూస్తున్నందున , ప్రజల మనసు గెలుచుకోవడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లోతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలు టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ఉన్నారని, ప్రజలు మోడీ బిజెపి ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నందున తెలంగాణలో కూడా బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలు నాయకులు తగిన కృషి చేయాలని పక్కా ప్రణాళికతో కార్యాచరణతో సమిష్టిగా చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా ఇన్చార్జి మాజీ శాసనసభలు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిని మరింత పటిష్ట పర చాలన్నారు. బీజేపీ అనుబంధ విభాగాల బలోపేతం చేయాలన్నారు.రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బిజెపి నాయకులు కార్యకర్తలు అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండి ,సమిష్టి కృషితో పని చేసి విజయం సాధించాలని తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సంస్థాగతంగా ఉన్న లోపాలను చక్క దిద్దుకొని ముందుకు సాగాలని సూచించారు. అతిధుల ప్రసంగానికి ముందు జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్ పలు రాజకీయ అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, బత్తుల లక్ష్మీనారాయణ ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల అంశాలను , అమృత్ మహోత్సవ వివరాలను , ఇతర అంశాలను కార్యకర్తలకు వివరించారు . అలాగే జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని సమావేశంలో తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు మాజీ శాసన సభ్యులు బొడిగె శోభ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కొరటాల శివ రామకృష్ణ ,అనిల్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి , బత్తుల లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ,ఎర్రబెల్లి సంపత్ రావు, గుర్రాల వెంకటరెడ్డి, బింగి కర్ణాకర్, భాస్కరాచారి, సత్యనారాయణ ,వై ద రామానుజo, బొంతల కళ్యాణ్ చంద్ర,సుధాకర్ అన్నాడ రాజిరెడ్డి, దురిశెట్టి సంపత్, మాడుగుల ప్రవీణ్, వేణు, దుబ్బల శ్రీనివాస్, జమాల్, మర్రి సతీష్ అలివేలు సమ్మిరెడ్డి, కార్పొరేటర్ దుర్శెట్టి అనుప్ సిద్ది సంపత్ తోపాటు మండలాల అధ్యక్షులు , మోర్చా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు