కేంద్రప్రభుత్వం అగ్నిపత్ జీవో వెంటనే రద్దు చేయాలి…
కాంగ్రెస్ నాయకుల డిమాండ్…
ఇల్లందు జూన్ 27 (జనం సాక్షి) కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపత్ జి ఓ వెంటనే రద్దు చేయాలని ఈ సోమవారం ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి గవర్నమెంట్ తీసుకు వచ్చినటువంటి అగ్నిపత్ జిఓ కి వ్యతిరేకంగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. అగ్నిపత్ జిఓ నీ వెంటనే రద్దు చేయాలని నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఇల్లందు పట్టణ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ దీక్షను విరమింప చేయడానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ విచ్చేసి ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంట్ అతి దారుణంగా ప్రజల్ని మోసం చేస్తూ ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వలేక కాలయాపన చేస్తుంది అన్నారు. చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న టువంటి వారి భవిష్యత్తును నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండా ఒంటెద్దు పోకడ పోతుంది అని ఆరోపించారు. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ ప్రగతిని విచ్ఛిన్నం చేస్తూ ప్రజలందరినీ అయోమయానికి గురిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అధికారం లోకి వచ్చే విధంగా ప్రజల ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, కామేపల్లి మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు , బయ్యారం మండల అధ్యక్షులు ముసలయ్య, టేకులపల్లి మండల అధ్యక్షులు గుండా నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్కీ నేను సురేందర్, దల్సింగ్ నాయక్, డాక్టర్ జి రవి, డాక్టర్ శంకర్ నాయక్, కిషన్నాయక్, ఆర్ఎం పాపారావు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ సాయి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం డి జాఫర్, పట్టణ సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, పట్టణ సీనియర్ నాయకులు జీవి భద్రం పట్టణ సీనియర్ నాయకులు ఆర్ జగన్నాథం, కే లక్ష్మణరావు, పట్టణ బీసీ సెల్ నాయకులు శంకర్, పట్టణ ఎస్సీ సెల్ నాయకులు శ్రీనివాస్, మైనార్టీ నాయకులు మసూద్, ఎస్ టి నాయకులు వాంకుడోత్ నాగరాజ్, పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ సం లక్ష్మణ్, సురేష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్ కే జానీ, గార్ల నాయకులు కృష్ణ గౌడ్, మహిళా నాయకురాలు శంషాద్ బేగం, జువా జి శ్రీనివాస్, రాము గౌడ్, బయ్యారం టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సీతారాం రెడ్డి, ఇల్లందు మండల నాయకులు వల్లాల రాజయ్య, జి రవి, కాయం రమేష్, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.