కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 28 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ నెల 28వ తేదీన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం మాట మార్చిందని ఆరోపిస్తూ సోమవారం రాష్ట్రా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఇంటి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో కేంద్రహోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర ప్రధాన కార్యదర్శి అన్వేష్‌ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి షిండే, ఆజాద్‌లు తెలంగాణ ప్రజలను అగౌరవ పరిచే విధంగా ప్రకటనలు చేయడం సిగ్గు చేటని వెంటనే వారిద్దరు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తెలంగాణ పై నిర్ణయాన్ని వెంటనే వెల్లడించపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా పో రాటాలు చేసుకుని వారిని అడుగడుగునా నిలదీస్తామని తె లిపారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణకు జరుగతున్న అన్యాయాన్ని గుర్తించి తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో అరుణ్‌గణేష్‌, ప్రశాంత్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.