*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆదివాసి గిరిజనులకు అందాలి.

*అధికారులకు ఆదేశించిన ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ.
భద్రాచలం, ఫిబ్రవరి 3 (జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ద్వారా గిరిజన సంక్షేమానికి ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుపేదలైన ఆదివాసి గిరిజన కుటుంబాలకు చెందేలా సంబంధిత యూనిట్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి ఒక మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు అందే విధంగా కృషి చేయాలని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పోట్రూ సంబంధిత యూనిటీ అధికారులకు ఆదేశించారు. గురువారం నాడు తన చాంబర్ లో ఐటిడిఎ, ఏ.పీ.ఓ జనరల్, పరిపాలన అధికారి యూనిటీ అధికారులు తో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటిడిఎ లోని ఇంజనీరింగ్ గిరిజన విద్య ట్రైకార్ వ్యవసాయం అటవీశాఖ, యు.వి ఇతర సంబంధిత గిరిజనులకు ఉపయోగపడే పథకాలకు సంబంధించి ప్రణాళికలు మరియు ప్రతిపాదనలు పాతవి కాకుండా కొత్తగా ఇంకేమైనా వస్తే ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో నివసించే కొండరెడ్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో ఎటువంటి  అవకతవకలు జరగకుండా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని అందుకు అనుగుణంగా ప్రతి యూనిట్ అధికారి ఆదివాసి గిరిజన కుటుంబాలు మరియు రైతులు గిరిజన విద్యార్థినీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన యూనిట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఓ జనరల్ డేవిడ్ రాజ్, పరిపాలనాధికారి భీమ్ ,ఎస్ఓ.సురేష్ బాబు ,డి.డి ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి ,ఈ.ఈ  ట్రావెల్ వెల్ఫేర్ తానాజీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.