కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 7శాతం డీఎ పెంపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కరవు భత్యం (డియర్నెస్ అలవెన్స్)ను ప్రభుత్వం 7 శాతానికి పెంచింది. ఇందువల్ల తమ మూలవేతనం(బేసిక్‌పే) లో 72 శాతాన్ని ఉద్యోగులు పొందవచ్చు. ఇందువల్ల 50 లక్షలమంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షన్లు లబ్ధి చెందుతారు. 2011లో ఒక పర్యాయం డిఎ పెంచారు. అది 2012 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుత పెంపుదల జూలై 1 2012 నుంచి అమలులోకి వస్తుంది. తర్వాతకాలానికి అరియర్లు కూడా ఇస్తారు.