చురుగ్గా నైరుతి..


` హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
` రోడ్లన్నీ జలమయంతో వాహనాదారుల ఇక్కట్లు
` భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
` హైదరాబాద్‌ వాసులకు మంత్రి పొన్నం సూచన
` తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వానలు
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. జవహర్‌నగర్‌లో రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. శ్రీవేంకటేశ్వర కాలనీని వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో మరోసారి కుండపోతగా వర్షం కురిసింది. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, బోయినపల్లి, ఆల్వాల్‌, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, ముషీరాబాద్‌, అబిడ్స్‌, కోటి, హిమాయత్‌ నగర్‌, కాచిగూడ, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, అవిూర్‌ పేట్‌, అశోక్‌ నగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ముషీరాబాద్‌, బంజారాహిల్స్‌, ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, కొత్తపేట, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, గాజుల రామారం, కుత్బుల్లాపూర్‌, నిజాంపేట్‌, మియాపూర్‌, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్‌పేట్‌, ఈసీఐఎల్‌, కప్రా, నేరేడ్‌మెట్‌, విద్యానగర్‌, నల్లకుంట తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. తీవ్ర వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే -టైమ్‌ కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నారు. రానున్న రెండు గంటల్లో నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని ఏఐఃఈ పేర్కొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాకూడదని.. ముఖ్యంగా వరదనీటితో నిండిన ప్రాంతాల్లో తిరగకూడదని హెచ్చరించింది. వర్షాల కారణంగా ఏమైన సమస్యలు తలెత్తితే వెంటనే 040-29555500, 9000113667 టోల్‌ ఫ్రీ నెంబర్లు కాల్‌ చేయాలని సూచించింది.
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. జిహెచ్‌ఎంసి విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుందని అన్నారు. హైదరాబాద్‌లో వర్షాలపై స్వయంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ఎక్కడైనా ఇబ్బందుల ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, హైడ్రా కమిషనర్‌, పోలీస్‌ కమిషనర్‌, వాటర్‌ వర్క్‌, ఇతర అధికారులను అప్రమత్తం చేసినట్లు- చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను జాప్యం లేకుండా త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజులపాటు- మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ఐదు రోజులు ఎల్లో అలర్ట్‌, మూడో రోజు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణలోని వికారాబాద్‌, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి, జయశంకర్‌, జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది షెడ్యూల్‌ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షాలు కురవలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవాలని పూజలు చేశారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. శుక్రవారం అత్యధిక వర్షపాతం నమైదైంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వానలు కురిశాయి. రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు- ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ అందించింది. తెలంగాణలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరిగి యాక్టివ్‌ అయినట్లు- తెలిపింది. మరో రుతుపవన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని.. మరో ద్రోణి ఏర్పడితే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే నాలుగు రోజుల పాటు- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురువనున్నట్లు- తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి.. దక్షిణ కోస్తా విూదుగా కొనసాగుతున్న ఉపరితల చక్రవహాక ఆవర్తనం.. నేడు తెలంగాణ తీరానికి దగ్గరగా ద్రోణి.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఉండడంతో హైదరాబాదీలు అలెర్ట్‌ గా ఉండాలని ఐఎండీ సూచన.. జీహెచ్‌ఎంసీ.. డీఆర్‌ఎఫ్‌ తో పాటు- సంబంధిత అధికారులను అలెర్ట్‌ చేసింది.