కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

> క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం
> మోడీ పాలనలో ఉద్యోగ భద్రత, దేశ స్వాహలంబనకే ముప్పు వచ్చింది
> సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం
> హాజరైన సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

జనం సాక్షి సంగారెడ్డి టౌన్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఘతించాలని, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకునేందుకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరెట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉద్యోగులకు భద్రత కరువైందన్నారు. ఎన్నో ఏళ్ళు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్ లు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తుందన్నారు. డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ వితరణ నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపుతుందని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ట్రాన్స్మిషన్, చమురు, సహజవాయువు పైపులైన్లు, బొగ్గు గనులు, టెలికం టవర్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్సిఐ గోడౌన్లు, క్రీడా మైదానాలతో సహా అన్నింటినీ తెగ నమ్మడం ప్రధాని మోడీకి అలవాటుగా మారింది అన్నారు. ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ , సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేష్ జి సాయిలు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బి ప్రసాద్ కార్మిక సంఘాల నాయకులు ఎం యాదగిరి పాండురంగారెడ్డి ప్రవీణ్ నరసింహారెడ్డి మైపాల్ బి నాగేశ్వరరావు సురేష్ శివశంకర్ బాబురావు ప్రసన్న రావు కొండల్ రెడ్డి రమేష్ తిరుపతి శాంత కుమార్ శ్రీనివాస్ రెడ్డి నాగభూషణం వెంకటరెడ్డి శ్రీధర్ దయానంద్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తాజావార్తలు