కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలి

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకిటి శ్రీహరి
మఖ్తల్ ఆగస్టు 05(జనంసాక్షి)
పెరుగుతున్న నిత్యవసర ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ “వాకిటి శ్రీహరి, మాజీ పీసీసీ అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బి నర్సింహులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరగొడుతున్నారని ఆరోపించారు. జీఎస్టీ విధానంతో సామాన్యమైన ప్రజలు తీవ్రమైన పనుల భారం పడుతున్న సందర్భంగా నిత్యవసర సరుకుల ధరలు ఆకాశానంటాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నియంత్రించి వెంటనే సామాన్యమైన ప్రజలకు గ్యాస్ పెట్రోల్ డీజిల్ అందుబాటులో దొరికేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. జిఎస్టి విధానాన్ని రద్దు చేయాలి. అకాల వర్షాల వల్ల వేసిన పంటలు మొలకెత్తక పోవడం వల్ల పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే రాష్ట్రప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు లోను కావడం వల్ల చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు బలిదానాలు కావడం చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ పాలసీని తీసుకొచ్చి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షతో ఉన్న నిరుద్యోగ యువతకు వారి ఆశయాలను అడియాసలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పథకాన్ని రద్దుచేసి గతంలో మాదిరిగానే ఆర్మీ రిక్రూమెంట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి విధానాన్ని విడనాడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల అధ్యక్షుడు గణేష్ కుమార్, ఉట్కూరు మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, నర్వ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, గొల్లపల్లి నారాయణ, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నర్వ మండల ప్రధాన కార్యదర్శి వివేకవర్ధన్ రెడ్డి, శరణప్ప, అయ్యప్ప రెడ్డి, మహేష్, వెంకటేష్, బోయ వెంకటేష్, కల్లూరి గోవర్ధన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు