కేటుగాడు శివానందబాబా అరెస్టు

1

హైదరాబాద్‌,జూన్‌ 16(జనంసాక్షి): బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా శివను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సవిూపంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు శివను పట్టుకున్నారు. చోరీ అనంతరం పరారైన శివ బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు శివను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, ‘లైఫ్‌స్టైల్‌’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు

కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్‌ శివస్వామి, శివబాబా… నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్‌చల్‌ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు.అసలేం జరిగిందంటే ¬మం పేరుతో కోటి రూపాయలను పది కోట్లు చేస్తానంటూ.. మధుసూదన్‌ రెడ్డిని బాబా నమ్మించినట్టు ప్రాథమికంగా తేల్చారు. రామాయణం కాలం నాటి నాణాలు తన దగ్గర ఉన్నాయని.. వాటిని ¬మంలో వాడితే  ముగ్గులో పెట్టిన కోటి రూపాయలు.. పది కోట్లు కావడం ఖాయమని బాధితుడిని బాబా ఆకర్షించినట్టు గుర్తించారు. బుధవారం ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారి ఇంటిలో పూజలు నిర్వహించాడు. అనంతరం మధుసూదన్‌ రెడ్డి కుమారుడు సందేశ్‌ రెడ్డితో కలిసి నకిలీ బాబా పూజలో పెట్టించిన రూ.కోటి ముప్పై లక్షల డబ్బును తమతో పాటు తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాల్లో బాబా పూజలు చేసి…బంజారాహిల్‌స్లో బస చేసిన ¬టల్‌కు వెళ్లారు.ఆ సమయంలో సందేశ్‌ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బాబాకు చెప్పడంతో, విశాంత్రి తీసుకోవాలని మాయ మాటలు చెప్పిన బురిడీ బాబా కారు కీని దొంగిలించి.. కారులోని డబ్బు మూటను తీసుకుని ఉడాయించాడు.  కొంతసేపటి తర్వాత తేరుకున్న సందేశ్‌ సాయంత్రం 5గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లోని అతని తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన సందేశ్‌ రెడ్డి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వెంటనే జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇక.. బాబా మాటలు నమ్మిన మధుసూదన్‌ రెడ్డి.. 2 రోజుల ముందే పూజకు సంబంధించిన వివరాలు తెలుసుకుని.. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 6 గంటల పాటు పూజ చేసిన తర్వాత డబ్బు పెరుగుతుందని చెప్పిన బాబా.. పూజ చేశాక 5 దేవాలయాలు తిరిగి.. ఒక్కో గుడి దగ్గర డబ్బుల బ్యాగు పెట్టాలని మధుసూదన్‌ కు సూచించాడు. తిరిగి ఆ డబ్బు ఇంటికి తీసుకొస్తే.. తను చెప్పినట్టు పెరగడం ఖాయమని నమ్మించాడు. పూజ తర్వాత మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చాడు. మరోవైపు.. డబ్బుల మూటలతో గుడికి వెళ్తున్నట్టు నమ్మించి.. మధుసూదన్‌ రెడ్డి కొడుకు సందేశ్‌తో కారులో బయల్దేరాడు దొంగబాబా. బంజారాహిల్స్‌ ఓరిస్‌ ¬టల్‌ దగ్గరికి చేరుకోగానే.. మధుసూదన్‌ రెడ్డి కొడుకును ధ్యానంలో కూర్చోవాలని బాబా సూచించాడు. ఆ వెంటనే.. కారు దిగి.. డబ్బులతో ఉడాయించినట్టు పోలీసులు గుర్తించారు.