కేతకి సంగమేశ్వర స్వామికి వెండి ఛత్రం బహుకరించిన భక్తుడు
ఝరాసంగం అక్టోబర్ 22 (జనంసాక్షి) దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాద్ చెందిన రాజేష్ మశెట్టి అనే భక్తుడు ఒక కిలో 7 గ్రాముల వెండి ఛత్రం ను బహుకరించారు. శనివారం ఆలయంలో ఈవో శశిధర్ ఆలయ కమిటీ చైర్మన్ నీలం వెంకటేశం లకు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుడు రాజేష్ మశెట్టి కి ఆలయం తరపున అభినందించారు. ఆలయ అభివృద్ధి లో పత్రి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శివురాజ్, సాయి,నాగేందర్ స్వామి శంకర్ తదితరులు ఉన్నారు.