కేయూ డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవస్థలు.

భైంసా రూరల్ జనవరి 12 జనం సాక్షి
 పరీక్షాకేంద్రాలమార్పులతో దూరాభావం…
– సరైన వసతులు లేక నానా అవస్థలు…
ఇటీవల ప్రారంభమైన డిగ్రీ పరీక్షలకు పరీక్షా కేంద్రలన్ని యూనివర్సిటీ అధికారులు మార్చారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సౌకర్యాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఉన్న.. కేంద్రాన్ని దూర ప్రాంతానికి మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు దూర భారం వల్ల హాజరు కావడం కష్టంగా మారిందని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.బై0సా పట్టణ ఎగ్జామ్స్ కేంద్రానికి సూరుగా 25 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు, పల్లెలులో చదువుకుంటున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. భైంసా పట్టణం మొత్తం మీదుగా రెండే ఎగ్జామ్స్ సెంటర్లను ఏర్పాటు చేయగా…నేల పై కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు.పట్టణం లోని ఓ ప్రవేట్ డిగ్రీ కాలేజీ లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నా  కాలేజీ లో 450 మంది విద్యార్థులు కు మాత్రమే పరీక్ష రాసే కెపాసిటీ వున్నా దాదాపు 800 మంది విద్యార్థులను కేటాయించిన యునివర్సిటీ అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు.డిగ్రీ థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్షల విద్యార్థులకు  చాలా తిప్పలు పడుతున్నామని,పరీక్ష పత్రం ఆన్లైన్ లో రావడం వల్ల పేపర్ ప్రింట్ కోసం 15 నుండి 20 నిమిషాలు ఆలస్యం అవ్వడం వల్ల ఎగ్జామ్ రాయడానికి పూర్తి సమయం సరిపోతలేదని… ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఓకే ఏ ఫోర్ సైజ్ పేపర్లో మైక్రో జిరాక్స్ గా తీసి ఇవ్వడం వల్ల అక్షరాలు కనబడక అర్థం కాక ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోయారు.మండలాల వారీగా సెంటర్ లు ఏర్పాటు చేస్తే బాగుంటందని విద్యార్థుల అభిప్రాయం వ్యక్తం చేశారు.