కేరళ సీఎంగా విజయన్
తిరువనంతపురం,మే20(జనంసాక్షి):
కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నేత పి. విజయన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాద ని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది.కేేరళలో సీపీఎం ఆధ్వ ర్యంలోని ఎల్‌డీఎఫ్(లెఫ్ట్ డెమోక్రటిక్ అల యన్స్) కూటమి విజయం సాధించడంతో సీపీఎం పార్టీ నుంచి ముఖ్యమంత్రిని ఎన్ను కుంటున్నారు. మొదట సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్ పేరు తెరవిూదికి వచ్చినప్పటికీ మళ్లీ అధిష్ఠానం విజయన్‌ను సీఎంగా నియమించాలని నిర్ణయించింది. సీపీఎం అధిష్ఠానం ఈరోజు విజయన్ పే రును అధికారికంగా ప్రకటించిం ది.సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ తదితరులు ఈరోజు తిరువనంతపురం చేరు కుని పార్టీ కార్యాలయంలో సీఎంగా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చలు జరిప ారు. రాష్ట్రంలో విజయన్ సారథ్యంలోనే ఎల్ డీఎఫ్ ప్రభుత్వం నడిపించాలని నిర్ణయిం చారు. అచ్యుతానందన్ వయసు 92ఏళ్లు కాగా విజయన్‌కు 72ఏళ్లు. విజయన్‌కు కిం దిస్థాయి నుంచి వచ్చిన నేతగా మంచి పేరు ఉంది. కేరళ కొత్త సీఎం ఎన్నిక కోసం స మావేశమైన పార్టీ పొలిట్ బ్యూరో? సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం పదవి విషయంలో ముందునుంచి విజయన్ కు అచ్యుతానంద్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అచ్యుతానంద్ వయసు 93 సంవత్సరాలు కావటంతో సీఎం బాధ్యతలు నిర్వహించటం కష్టమని పార్టీ అధినాయకత్వం భావించింది. దీంతో విజయన్ కే అవకాశం ఇచ్చారు