కేవీకే గడ్డిపల్లి లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం
గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో 12వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా కె.వి.కె లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారి ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు కె వి కే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ లవకుమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పట్టు పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ వీర కుమార్ మాట్లాడుతూ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అందించే వివిధ సబ్సిడీల గురించి వివరించారు. వరికి ప్రత్యామ్నాయంగా పట్టు పురుగుల పెంపకం ఎంతో లాభదాయకమని వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి జగన్ మాట్లాడుతూ ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కె వి కే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ లవకుమార్ మాట్లాడుతూ కెవికె ల ద్వారా రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆచరించదగిన నూతన పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ లో 15000 మంది రైతులతో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడిన హిందీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన తెలుగులో అనువదించి వివరించారు. మోది ఏర్పాటు చేసిన పేదల సంక్షేమ సమ్మేళనమ్ 100% సాధికారత ప్రజా సంక్షేమ పథకాల గురుంచి లబ్ధిదారులతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖాముఖి ప్రసంగం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 10 కోట్ల కంటే ఎక్కువ మంది రైతులకు రూ.16 వేల కోట్లకు పైగా 12వ విడత నగదు బదిలీ చేయడం దేశ వ్యాప్తంగా మొదటి విడతగా 600 ల ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ది కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించారని ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఒకే దగ్గర అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనే నూతన స్కీం ద్వారా భారత్ పేరుతో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
తదుపరి ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ ఉమ్మడి నల్గొండ జిల్లా మేనేజర్ ఏ వెంకటేష్ నానో యూరియా నానో డి ఏ పి సాగరిక సముద్రపు నాచు నూతన ఎరువుల యొక్క ఉపయోగాలను రైతులకు వివరించారు. సమగ్ర వ్యవసాయ విధానాలు రైతుల ఆదాయం రెట్టింపు చేసే పంటలను ఎంచుకోవాలని తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు నరేశ్, కిరణ్, డి. ఆదర్శ్, సుగంధి, మాధురి, బేయర్ క్రాప్ సైన్స్ ఏరియా మేనేజర్, లక్ష్మీనారాయణ, గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న బి యస్ సి వ్యవసాయ డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Attachments area