కేవీపీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక. జిల్లా అధ్యక్షులు గా అంతటి కాశన్న.

ప్రధాన కార్యదర్శిగా పులిజాల పరుశరాములు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):
కేవిపీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని జిల్లా కేంద్రలోని సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నాగర్ కర్నూల్ జిల్లా రెండవ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మొత్తం 28 మంది కమిటీ ఎన్నుకోగా అందులో 10 మందిని అఫిస్ బేరర్స్ గా 18 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా తాడూరు మండలానికి చెందిన అంతటి కాశన్న ప్రధాన కార్యదర్శి కల్వకుర్తి గ్రామానికి చెందిన పులిజాల పరశురాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కెవిపిఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు జిల్లా కమిటీని ప్రతిపాదించగా హాజరైన ప్రతినిధులందరు ఏకగ్రీవంగా ఆమోదించారు.జిల్లాలో దళితుల సమస్యల పై నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తూ సమస్య ల పరిస్కారం కోసం నిత్యం కృషి చేసేలాగా ఈ కమిటీ పని చేయాలని ఆకాంక్షించారు.కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ మహాసభలో ఎన్నికైన నూతన జిల్లా కమిటీ పై ఎంతో బాధ్యత ఉందని దళితుల సమస్యల పై పని చేయాలని అన్నారు.జిల్లాలో దళితుల సమస్యల పై నిరంతరం పోరాడతామని అన్నారు.ఉపాధ్యక్షులు నందిపేట భాస్కర్, శివ కుమార్,సహాయ కార్యదర్శులుగా హనుమంతు,అశోక్,రాజు,జిల్లా కమిటీ 28 మందితో ఎన్నికయ్యారు