కేసి గుప్త విగ్రహ పునర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వాతంత్ర సమరయోధులు, వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త విగ్రహ పునర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, పూర్వ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బ్రహ్మాండ్లపల్లి మురళీధర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ లో గతంలో సీఎం కేసీఆర్ తో ఆవిష్కరించబడిన కేసి గుప్త విగ్రహం రోడ్ల వెడల్పు మరమ్మత్తులతో తొలగించినందున మళ్లీ మంత్రి జగదీష్ రెడ్డి చేతులమీదుగా ఈనెల 16న నూతనంగా ఆవిష్కరించనున్నందున జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్ లో సమాజ సేవకులు వనమా వెంకట్రామయ్య, గుండా వెంకటప్పయ్య సమస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంత రాములు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉప్పల ఆనంద్, సవరాల సత్యనారాయణ, తోట శ్యాం ప్రసాద్, మీలా వంశీ, రాచర్ల కమలాకర్, చల్లా లక్ష్మీకాంత్, గోపారపు రాజు, బోనగిరి విజయ్ కుమార్, గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్ బోల్లం సురేష్, కలకోట లక్ష్మయ్య అనిత, బెలిదే శ్రీనివాస్, మిరియాల రామమూర్తి, చల్లా లక్ష్మీప్రసాద్, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు