కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తా

2

నేను తప్పు చేయలేదు-మాజీ మంత్రి రాజయ్య

హైదరాబాద్‌,జనవరి 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తానని మాజీ మంత్రి రాజయ్య స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాకు తండ్రిలాంటి వాడు. సీఎం పలుసార్లు నన్ను ప్రోత్సాహించాడు. ఊహించని రీతిలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు సీఎం. ఏడు నెలల కాలంలో సహాయ సహకారాలు అందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖలో ఉన్న అభద్రతా భావం, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తిరిగాను. వైద్య శాఖలో ప్రక్షాళన కోసం కృషి చేశా. డాక్టర్లలో ఆత్మైస్థెర్యం పెంపొందించడానికి కృషి చేశా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆస్పత్రుల్లో బస చేశా.

నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒక వేళ తప్పు చేస్తే క్షమించాలి. ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్‌ లక్ష్యం. వైద్య, ఆరోగ్య శాఖలో మరో పొరపాటు జరగకూడదనే సీఎం కేసీఆర్‌ నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో జరిగిన తప్పులతో సీఎం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కూలీగా పని చేయడానికి సిద్ధం. కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకెళ్తాను. నేను యేసు ప్రభువు బిడ్డగా చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేశాను అని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని చెబుతూ విూడియా సమావేశం ముగించారు. వైద్య, ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి కారణంగా రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించిన విషయం విదితమే.