కేసీఆర్‌ పేదల పక్షపాతి

5

మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ 2 జూలై (జనంసాక్షి)

హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన పేదల పక్షపాతని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్‌కు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడారు. హైద రాబాద్‌ నగరంలో మంచినీటి సమస్యలేకుండా చూస్తామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌ లోని బస్తీలను దత్తత తీసుకొని సిద్ధిపేట పట్టణంలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా దాదాపు 6 వేల మందికి సాయం చేశామన్నారు. హైదరాబాద్‌ చుట్టూ పరిశ్రమలు వస్తున్నాయని వీటి ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు యత్నిస్తున్నాడని మండిపడ్డారు. నగరానికి నీల్లు తీసుకు రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రయత్నాలను

తిప్పికొడుతున్నారని తెలిపారు. త్వరలో మహిళలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. వచ్చే యేడాది లోపు హైదరాబాద్‌ నగరంలో లక్ష మంది నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తామని హావిూ ఇచ్చారు.