కేసీఆర్ వ్యాఖ్యలపై బిజెపి ఫైర్

మల్దకల్ జులై11(జనంసాక్షి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో  బీజేపీ,మోడీపై తీవ్ర విమర్శలు చేశారని ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై మల్దకల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి  మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆయన ఫైర్ అయ్యారు.జోగులాంబ అమ్మవారిపై వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్ పతనం ప్రారంభమైందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హిందూ దేవతలపై కేసీఆర్ అహంకారపు మాటలా? అని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ భద్రకాళి, జోగులాంబ అమ్మవారిని విస్మరిస్తేదానిని కేసీఆర్ అవహేళన చేయడం ఏంటని అని ఆరోపించారు.పదే పదే హిందూ జీవన విధానాన్ని అవమానించేలా మాట్లాడటం, దేవతా మూర్తుల పేర్లను అవహేళన చేయడమేనా కేసీఆర్ నైజం అని  ప్రశ్నించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దామ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు.దేవతల పేర్లు వక్రభాష్యంగా మాట్లాడుతూ హిందూ సమాజానికే మచ్చ తెస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలోబీజేపీ మండల అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దామనాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి దామవెంకటేష్, మండల ఉపాధ్యక్షుడుజంగం రాజశేఖర్ బీజేవైఎం మండల అధ్యక్షుడు,లక్మి నారాయణ,తదితరులు పాల్గొన్నారు.