కేసు నమోదుతో ఉద్యోగి ఆత్మహత్య
జగిత్యాల,నవంబర్6(జనంసాక్షి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేటలో సాప్ట్‌వేర్ ఉద్యోగి కొసరి దశరథం (27) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరపేటకు చెందిన దశరథ్‌రెడ్డి బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన ఆరపేటకు వచ్చాడు. దశరథం కుటుంబ సభ్యులకు గ్రామంలోని ఓ వర్గానికి మధ్య భూ వివాదం నడుస్తోంది. దీని కారణంగా దశరథం తండ్రిపై కేసు నమోదైంది. దీంతో మనస్తాపం చెందిన దశరథం ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.