కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత, శాంతి మార్గాన్ని ప్రబోధిస్తూ అహింస అనే ఆయుధంతో హక్కులని సాధించు కోవచ్చు అని నిరూపించి అహింసో పరమో ధర్మః అనే భారతీయ తత్వాన్ని విశ్వమంతా పంచి నిరాడంబరమైన జీవిత ఆదర్శంతో ప్రపంచానికి నిత్య స్మరనీయులైన మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు వూరే జనార్దన్, ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా ధనంజయ, కొండమల్లేపల్లి జెడ్పిటి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, నీలా లక్ష్మయ్య, అంకి శెట్టి శేఖర్, ఆకుతోట లక్ష్మీనారాయణ, తెరటిపల్లి విఠల్, బూరుగు కుమార్, పంపాటి శ్రీధర్, చెట్లపల్లి శ్రీనివాస్, బండారు రాము, గుమ్మడవెల్లి జనార్ధన్, వూరే నరేష్ తదితరులు పాల్గొన్నారు