కొండమల్లేపల్లి మండలంలో రేషన్ షాపులను తనిఖీ చేసిన కేంద్ర విజిలెన్స్ బృందం

అక్టోబర్ 11 జనం సాక్షి: ప్రజా పంపిణీ ప్రహసనం చేసే ప్రబుద్దుల కు తగిన గుణపాఠం తధ్యం అని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన కొండమల్లెపల్లి లో చౌక దుకాణాల ను కేంద్ర విజిలెన్స్ బృందం తో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ. రేషన్ ను ఇష్టానుసారంగా నిర్వహిస్తే డీలర్ షిప్ రద్దు కావడం ఖాయం అని స్పష్టం చేశారు. చిన్న అడిశర్ల పల్లి చౌక దుకాణం లో బియ్యం అధికంగా ఉండటం తో కేసు బుక్ చేసి ఆ దుకాణం భాధ్యతలు దొనియాల కు చెందిన డీలర్ అమృత రెడ్డి కి అప్పగించినట్లు రఘునందన్ తెలిపారు. తనిఖీ బృందం లో ఆర్ పులయ్య, కమాల్ పాషా లు ఉన్నారు