కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని శనివారం కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సర్వసభ్య సమావేశం లో వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ, ఉపాధి హామీ, ఐసిడిఎస్, విద్యుత్ శాఖ, రహదారులు మరియు భవనముల శాఖ, ఇరిగేషన్ శాఖ, ఐకెపి, ఫిషరింగ్, సివిల్ సప్లై, మండల రెవెన్యూ శాఖ, మండల విద్యుత్ శాఖ, ఏపిఎం డి ఆర్ డి ఏ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఇరిగేషన్ సబ్ డివిజన్ శాఖ ల మీద సమీక్ష సమావేశాలు జరిగాయి వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొని వారి శాఖలకు సంబంధించిన వివరాలు అధికారులకు ప్రజాప్రతినిధులకు చాలా క్లుప్తంగా సరళంగా వివరించారు ఏయే  శాఖలలో అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయో వాటిని ఇంకెప్పుడు పూర్తి చేస్తారో సర్వసభ్య సమావేశంలో వివరించారు  మండల వివిధ అభివృద్ధి శాఖలకు సంబంధించిన ఏమైనా అభివృద్ధి పనులు ఆటంకాలు ఉన్నాయో మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు వారి గ్రామాల పట్టణాల సమస్యలను సర్వసభ్య సమావేశ దృష్టికి తీసుకువచ్చారు ఏఏ   గ్రామాలలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో ఏఏ   గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు కావాలో ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో చెప్పారు మరియు కొన్ని గ్రామాలలో పడకేసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజాప్రతినిధులు సూచించారు ఏఏ గ్రామాలలో సమస్యలు ఉన్నాయో అధికారులు నోట్ చేసుకుని త్వరలో పనులకు ఆటంకాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటామని సూచించారు సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది చాలా సమస్యలు పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రజాప్రతినిలు వాపోయారు పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు మండల సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి ప్రసంగిస్తూ మండలంలోని అన్ని గ్రామాలకు ఈ సమస్యలు రాకుండా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె కోరారు ఈ సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో కొండమల్లేపల్లి జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ, ఎంపీడీవో బాలరాజు రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వినోద్, కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు  కుంభం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ శివ గౌడ్, చెన్నారం ఎంపీటీసీ జగన్ నాయక్, ధోనియాల సర్పంచ్ కవితా రెడ్డి, గాజినగర్ ఎంపీటీసీ రమేష్, మిషన్ భగీరథ ఎయ్యి ఏ మాల్యాద్రి, కే లింగం, విద్యుత్ శాఖ ఏఈ దావోజి, వ్యవసాయ శాఖ ఆఫీసర్ ఎస్ వెంకన్న, ఆర్ అండ్ బి ఏ ఈ వి సతీష్, పి ఆర్ ఏ ఈ ధర్మేంద్ర కుమార్, ఐసిడిఎస్ అధికారి పి సరళ, హెచ్ తారకమ్మ, అడిషనల్ ఈజీఎస్  పి రామచంద్, హెచ్ ఇ ఓ  బి హావిల్ కుమార్, ఏపీఎం డిఆర్డిఏ బి శ్రీనివాస్, యం వో డాక్టర్ ఉషారాణి, ఎం ఆర్ ఐ పి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ డి  శ్రీనివాస్, హెచ్ ఓ ప్రవీణ్ కుమార్, ఎండిఅజహార్ అలీ ఇరిగేషన్ సబ్ డివిజన్ మరియు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు