కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు స్ఫూర్తిదాయకం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పోషించిన పాత్ర మరువలేనిదని వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, వరంగల్ తూర్పు బిజెపి నాయకులు గంట రవికుమార్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు.
కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలితరం పోరాటయోధుడని, ఆఖరి శ్వాస వరకు తెలంగాణకై పోరాడిన పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నేటి తరం యువతకు ఆదర్శమన్నారు.
గంట రవికుమార్ మాట్లాడుతూ..
ప్రజల పట్ల నిబద్దత, కార్యదక్షతతో, నిజాయితీగా రాజకీయాల్లో రాణించారని, హుందాగా వ్యవహరించారని, నేటి తరానికి ఆదర్శప్రాయులని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా పదాదికారులు, జిల్లా మోర్చా నాయకులు, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.