కొండా లక్ష్మణ్ బాపూజి నిఖార్సయిన తెలంగాణ వాది.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వద్ద గల ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ సైన్స్ కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయం తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కమర్ షాజహాన్ సుల్తానా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కళాశాల అద్యాపకు ల సమక్షంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రిన్సిపాల్ కుమార్  షాజహాన్ సుల్తానా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజి  నిఖార్సయిన తెలంగాణ వాది అని తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం  స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వర్కాల శ్రీనివాసులు,రాజు,ఆంజనేయులు, ముజఫర్, దశరథం, శైలజ, ప్రతాప్ రావు, జంగిటి శ్రీను, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు