కొడ్వటూరులో శివరాత్రికి ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు.  మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని శివుడి కృపకు పాత్రులు కావాలని కోరారు.  మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. బ్ర¬్మత్సవాలు కన్నులపండువగా జరుగుతాయని
నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలకు హాజరు కావాలని దేవాదయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లను ఆహ్వానించబోతున్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. ఐదేళ్లుగా సర్పంచ్‌ సతీష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో శివకల్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారని అభినందంచారు. రెట్టింపు ఉత్సాహంతో ఈసారి వైభవంగా జరిపించాలన్నారు. ప్రభుత్వం, దేవాదయ శాఖ తరఫున సహాయ సహకారాలు ఉంటాయన్నారు. సిద్ధేశ్వరుడి ఆశీర్వాదాలను భక్తులు ఏటా పొందుతున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున ఇప్పటికే రూ. 50 లక్షలు మంజూరయ్యాయని ముత్తిరెడ్డి అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసి జిల్లాలోనే సిద్ధులగుట్టను మినీ యదాద్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.