కొణిదెల చిరంజీవి కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం

కామర్స్‌లో గ్రాడ్యుయేట్‌. ఆయనకు భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్‌ ఉన్నారు. తెలుగు సినీ రంగాన్ని 25 ఏళ్లకు పైగా ఏలిన మెగాస్టార్‌. 2008లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించారు. అంతేగాక తన పార్టీ తరఫున తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలుపొందగా.. పాలకొల్లులో పరాజయం పాలయ్యారు. ఏమైందో తెలీదు గానీ.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా ఆశీస్సులతో ఆదివారంనాడు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా 1996లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టును స్థాపించి సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. బ్లడ్‌ బ్యాంకు, ఐ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. చిరంజీవి సేవలకు గాను పద్మభూషణ్‌ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అలాగే ఆంధ్రా వర్శిటీ కూడా డాక్టరేట్‌తో చిరూను గౌరవించింది.