కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ పెంపు పై తెరాస ధర్నా.

      జనంసాక్షి, కొత్తకోట,జూలై 8,                          కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై పెంచిన ధరలకు నిరసనగా కొత్తకోట మండల తెరాస పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అయ్యప్ప విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అర్ధగంట పాటు రాస్తా రోకో నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు 30 సార్లు గ్యాస్ సిలిండర్ పై ధరలు పెంచి సామాన్యుని నడ్డి విడిచిందని పరిపాలించడానికి చేతకాకపోతే ప్రధాని మోదీ వెంటనే గద్దె దిగాలని  డిమాండ్ చేశారు.అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల బతుకు భారం చేసిన ఏకైక ప్రధాని మోడీ అని.. ప్రభుత్వ  రంగ సంస్థల ను అంబానీ,ఆదానీలకు అమ్మి భారతదేశాన్ని గుజరాత్ వాసులకు తాకట్టు పెట్టారని విమర్శించారు.రాష్ట్ర తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచన మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టినట్లు తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్,ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్,మున్సిపల్ వైస్ చైర్మన్ బీ సం జయమ్మ,  మార్కెట్ చైర్మన్ సాక బాలనారాయణ,మాజీ మార్కెట్ చైర్మన్ భీమ్ రెడ్డి, సిడిసి చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఆకుల శ్రీను,జిల్లా తెరాస అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్ మార్కెట్ వైస్ చైర్మన్ యాదగిరి,మున్సిపల్ కౌన్సిలర్లు మహేశ్వరి రాము యాదవ్,ఖాజ మైనోద్ధిన్, రామ్మోహన్ రెడ్డి,పద్మ అయ్యన్న, చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,హోటల్ రాములు యాదవ్,ఎరుకలి తిరుపతయ్య,కో ఆప్షన్ సభ్యులు తహేసీన్ వహీద్ అలీ, మండల మహిళా అధ్యక్షురాలు నిర్మల వెంకట్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటన్న గౌడ్,సంజీవులు, పెంటన్న యాదవ్,మాజీ వార్థు సభ్యులు సుభాష్,తెరాస మండల మైనార్టీ అధ్యక్షులు లాలు,పట్టణ ఉపాధ్యక్షులు బాబా,పట్టణ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ సాజిద్ అలీ, పట్టణ తెరాస ప్రధాన కార్యదర్శులు వికాస్,తాహేర్ బాబా,మండల యూత్ అధ్యక్షులు పసుపుల నెహ్రూ, పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు తాజ్,నెహ్రూ,అనిల్,వహబ్ తదితరులు పాల్గొన్నారు.