కొత్తగా 38,353 కేసులు నమోదు


కేరళలో మళ్లీ పెరుగుతున్న కేసులు
ఆందోళనకరంగా పరిస్థితులు
న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.20కోట్ల మార్క్‌ను దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుందని పేర్కొంది.
వైరస్‌ బారినపడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 4,29,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,86,351గా ఉన్నాయని, 140 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.34శాతానికి, రోజువారీ 2.16శాతానికి చేరుకుతుందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 48.50కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చినట్లు వచ్చి మళ్లీ దేశంలో కరోనా వైరస్‌ కలవరపెడుతూనే ఉంది. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ చాపకింద నీరుగా విస్తరిస్తోంది. దేశంలోని 44 జిల్లాల్లో వారపు పాజిటివ్‌ రేట్‌ 10 శాతంగా ఉంది. కేరళలో ఏకంగా లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతోపాటు తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, మిజోరం తదితర 9 రాష్టాల్లోన్రి 37 జిల్లాల్లో రోజు వారి కేసులు పెరుగుదల ఆందోళనకర స్థాయిలో ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడిరచారు. ఈ 37 జిల్లాల్లో 11 జిల్లాలు కేరళలో ఉన్నాయి. దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను 86 శాంపిల్స్‌లో గుర్తించినట్లు కేంద్రం వెల్లడిరచింది. కేరళలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం డెల్టా రకానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. కేరళలో ఆర్‌` వాల్యూ ఒకటికి మించి కొనసాగుతోంది. అక్కడ టెస్ట్‌ పాజిటివిటీ రేట్‌ 16 శాతంగా ఉంది.