కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204 పై వస్తున్న వార్తలలో నిజం లేదు

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  యాచారం మండలం కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204, పై వస్తున్న వార్తలలో నిజం లేదు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూన్నా భూ యజమానులు  సర్వే నెంబర్ 204 పై కొద్దీ రోజులుగా వస్తున్న వార్తలను భూ యజమానులు వంగ జంగారెడ్డి మరియు కళ్ళు యాదిరెడ్డి వారసులు ఖండించారు..తమకు రికార్డు పరంగా అన్ని విధాలుగా  కబ్జాలో ఉన్న భూమి మాదే అంటున్నారు..1955  సంవత్సరాలుగా మాకు  పట్టా ఉండి  సాగు చేసుకుంటున్న  భూమిలోకి కొంతమంది, కళ్లు వేణుగోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి,యాదిరెడ్డి,లక్ష్మ రెడ్డి లు అక్రమంగా ప్రవేశించి ఈ భూమి తమకు వస్తుంది అని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..అని అన్నారు…1954 సంవత్సరం లొ కళ్ళు నారాయణ రెడ్డి పేరుమీద  14.4 ఎకరాల భూమి ఉంది వంశపారంపర్యంగా కళ్ళు యాదిరెడ్డి కి ఆ భూమి సంక్రమించింది అందులోనుండి  1991 లో వంగ జంగారెడ్డి కి అమ్మగా మిగిలిన భూమిని తమ కూతుళ్లు అయిన మిట్టభావి లక్ష్మమ్మ కి 3 ఎకరాలు, అలహువెళ్లి పద్మమ్మ కు 8 ఎకరాల భూమిని ఇచ్చారు  అని ఈ భూమి వివరాలు రెవెన్యూ రికార్డు లో కబ్జాలో  కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ సదరు కొంతమంది  వ్యక్తులు కావాలని తమ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు… ఏదైనా ఉంటే చట్టం ప్రకారం వెళ్లాలి కానీ దౌర్జన్యానికి పాల్పడుతూ,  రాత్రి సమయంలో ఎవరు లేనిది చూసి అక్రమంగా  ప్రవేశించి దున్నడం సరైనది కాదు అన్నారు.. తమ భూమిని చాట్ల వెంకటయ్య ఆయన కుమారుడు రాములు 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న దళితులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆరోపిస్తున్నారు…అర్ధరాత్రి సమయంలో సుమారు 2 లక్షలు విలువ చేసే పంటను దున్ని నాశనం చేశారని. అలాగే పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని , దీనిపై పోలీసులను ఆశ్రయించాగా సదరు వ్యక్తులపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు అయ్యాయని తెలిపారు…మా పై దాడికి పాల్పడుతూ మళ్ళీ  హెచ్ ఆర్ సి లో పిర్యాదు చేశారని మేము కూడా త్వరలోనే హెచ్ఆర్సీ ,ఎస్సి, ఎస్టీ కమీషన్ ని కలుస్తామని తెలిపారు…ఈ భూమి లో  అనవసరంగా రాజకీయనాయకులను,పోలీసులను లాగుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు.. ఈ భూమి విషయం పై గ్రామంలో ఎవరిని అడిగిన మాదే అని చెప్పుతారని  వారు అంటున్నారు అనవసరమైన తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదు అని హెచ్చరించారు.
Attachments area