కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు
తాజాగా మరో 617మంది మృత్యువాత
50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ
న్యూఢల్లీి,ఆగస్ట్7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. శుక్రవారం 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17లక్షలకు పైగా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. నిన్న 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. మొత్తం రికవరీలు మూడు కోట్ల 10లక్షలకు చేరాయి. ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. శుక్రవారం 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది. కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది.