కొత్త జిల్లాలు రావు..ఉన్న జిల్లాలు పోవు…
` సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ తీసుకోం
` కేసీఆర్, కేటీఆర్‌ను కాపాడుతున్నది కిషన్‌రెడ్డి కాదా?
` బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తాం
` ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప ఉద్యమ నేత
` దక్షిణ కుంభమేళాగా సమ్మక్క`సారలమ్మ జాతరను జరుపుకున్నాం
` బీఆరఎస్ పాపాల ఊబిలో కూరుకుపోయింది
` టెలిఫోన్ ట్యాపింగ్ తో వందల కోట్లు దోచుకున్నారు
` వ్యాపారులను బెదిరించి భూములను రాయించుకున్నరు
` బీజేపీ, బీఆరఎస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివి
` వారి మాటలు నమ్మితే ఆగమవుతాం
భూపాలపల్లి జిల్లా చెల్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ రద్దు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న జిల్లాలను తొలగించేది లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా జిల్లాలోని గుణపురం మండలం చెల్పూర్ పరిధిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయాలంతే ప్రజలతో చర్చించే చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు, ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంపై కొందరికి విషం చిమ్మడమే పని అని విపక్షాలను విమర్శించారు. మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్మతే ఊరుకునేది లేదని ఉద్ఘాటించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదని వెల్లడించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని సీఎం రేవంత్?రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదని వెల్లడించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందిని సీఎం పేర్కొన్నారు. దేశానికే నాయకత్వం వహించిన మాజీ ప్రధాని పీవీ ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక పాత్రపోషించిందని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప ఉద్యమ నేత అని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల ప్రత్యేకతను ఉద్యమంలో చూశామని వెల్లడించారు.2004`14 మధ్య 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎవరికైనా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వచ్చిందా అని ప్రశ్నించారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు మాత్రం ఫామ్‌హౌస్‌లు ఇచ్చాయని విమర్శించారు. కేసీఆర్‌కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదు అని పునరుద్ఘాటించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్ని బీఆరఎస్‌కు అని వారు అంటే ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్ని కాంగ్రెస్‌కు అని ఆనాడు చెప్పానని సీఎం పేర్కొన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓట్లు వేశారని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ఇళ్లన్నీ నిర్మించుకొమ్మని అన్నారు. ఏప్రిల్ తర్వాత ఇందిరమ్మ ఇల్లు రెండోవిడత ఇస్తామని వెల్లడించారు.దక్షిణ కుంభమేళాగా సమ్మక్క`సారలమ్మ జాతరను జరుపుకున్నామని సీఎం పెర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తామని హావిÖఇచ్చారు. అటవీ ప్రాంతంలో రిసార్ట్‌లను అభివద్ధి చేస్తామని వెల్లడించారు.కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ అరెస్టును ఆపుతున్నారని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి నేను ముఖ్యమంత్రినా అని కిషన్‌రెడ్డి చెప్తున్నారని తెలిపారు. సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని సీబీఐ, ఈడీ కేసులతో అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ కేసులతో రాహుల్‌గాంధీని వేధిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదని కేంద్రాన్ని నిలదీశారు. ఫార్మలా`ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను కాపాడుతున్నది విÖరు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేసే వరకు కిషన్‌రెడ్డి పేరు కిషన్‌రావే అని అన్నారు. కేసీఆర్‌కు దొంగ పుత్రుడు కేటీఆర్ దత్త పుత్రుడు కిషన్‌రెడ్డి అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌తో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. బీఆరఎస్ అంటే బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితిఅని విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ, బీఆరఎస్ ఒకటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ సాయానికి 8 ఎంపీ సీట్లను బీఆరఎస్ ఇచ్చిందిని చెప్పారు. ఇప్పడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆరఎస్ సహాయపడుతోందన్నారు.కేసీఆర్, మోదీని చూసి ఓటు వేయాలని బీఆరఎస్, బీజేపీ చెప్తున్నాయని సీఎం అన్నారు. మోదీ ఫొటో చూసి ఓటు వేయాలంటున్నారు గల్లీలో సమస్యలను మోదీ వచ్చి తీరుస్తారా అని ప్రశ్నించారు. పిల్లగాడిని చూసి పిల్లనిస్తారా, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తారా? అంటూ విమర్శించారు. మనవారిని గెలిపిస్తే ఇక్కడే ఉంటూ మన పనులు చేస్తారని హావిÖ ఇచ్చారు. తన దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టించుకునే చనువు విÖ నాయకుడికి ఉంది అని పేర్కొన్నారు. ఏనాడైనా మోదీ భూపాలపల్లి వచ్చారా? అని అడిగారు. కేసీఆర్, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రెండేళ్లలో మున్సిపాల్టీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ మున్సిపాల్టీలకే రూ. 6,016 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేను అడగలేదన్నారు. ఎమ్మెల్యే సహకారం లేకపోతే తాను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదని తెలిపారు. ఇంటిల్లిపాదికి కేసీఆర్ పదవులు ఇచ్చారని విమర్శించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ భూపాలపల్లికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.
సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ తీసుకోం
సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు.పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. రేగొండ మండలం కొడవటంచ చేరుకున్న సీఎం శ్రీ లక్క్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి, పక్కనే ఉన్న బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.12.15 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం, అభివద్ధి పనులను పరిశీలించారు. ఈ పనుల్లో భాగంగా నిర్మించిన వసతి గహ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.“ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. దేశానికే నాయకత్వం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. సింగరేణి కార్మికుల ప్రత్యేకతను ఉద్యమంలో చూశాం. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన మాకు లేదు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించే చేస్తాం. భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. కొనసాగుతుంది.2004`14 మధ్య 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చాం. గత పదేళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు మాత్రం ఫామ్‌హౌస్‌లు వచ్చాయి. కేసీఆర్‌కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్నీ బీఆరఎస్‌కు.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్నీ కాంగ్రెస్‌కు అని ఆనాడు చెప్పా. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓట్లు వేశారు. ఏప్రిల్ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ఇస్తాం. దక్షిణ కుంభమేళాగా సమ్మక్క.. సారలమ్మ జాతర నిర్వహించుకొన్నాం. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో రిసార్ట్‌లను అభివద్ధి చేస్తాం.బీఆరఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.1500 కోట్లు తీసుకున్నారు. బీఆరఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. పాపాల ఊబిలో ఆ పార్టీ కూరుకుపోతుంది. కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ అరెస్టును ఆపుతున్నారు. ‘నేను ముఖ్యమంత్రినా కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి’ అని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని సీబీఐ, ఈడీ కేసులతో అవమానిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదు. ఫార్ములా`ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను కాపాడుతున్నది విÖరు కాదా?” అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


